డెంగ్యూ వ్యాధి దోమలతో వస్తుందనే విషయం తెలిసిందే. ఈజిప్టి జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుండి..ఈ వ్యాధి సోకుతుంది. ఈ దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు పగటిపూటే కుడుతాయి. దోమ కుట్టిన ఐదు..ఎనిమిది రోజుల తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. మరి ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..చూద్దాం..
వ్యాధిలక్షణాలు..
- నోరు ఎండిపోవడం జరుగుతుంది. దాహం కూడా అధికమౌతుంది.
- కండరాలు..కీళ్ల నొప్పులుంటాయి.
- వాంతి అవుతున్నట్లు అనిపిస్తుంటుంది.
- జ్వరం అధికంగా వస్తుంది.
- తలనొప్పి కూడా అధికంగా ఉంటుంది.
ఈ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. వ్యాధి ఉందో..లేదో నిర్ధారణ చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందుతాయి. నీరు కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటే ఈ రకమైన దోమలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా తొట్టీలు..కుండీలు..ఖాళీ డ్రమ్ములు..బిల్డింగ్ లపై నిలిచిన వాన నీటిలో ఎక్కువగా పెరుగుతుంటాయి.
జాగ్రత్తలు..
డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. నీరు నిల్వకుండా చూసుకోవాలి. ఇళ్ల వెలుపల నీటి నిల్వలను పారేయాలి. నీటి ట్యాంకుకు మూత వేయాలి. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించి, వారంలో ఒక రోజు డ్రైడే విధానాన్ని తప్పక పాటించాలి.
• దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి కాపాడుకోవాలి.
• శరీరంలోని అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.
• పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి.
• పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించాలి.
• జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Like//Share :