This Blog is Under Construction...!!!

Friday, September 22, 2017

వ్యాకులత (Depression) మరియు నివారణ మార్గాలు

వ్యాకులత లేదా డిప్రెషన్ మానసిక తుగ్మతల లో ముందుగా చెప్పుకోవలసిన వ్యాది . ఈ వ్యాధి కి గురి అయ్యే వారిసంఖ్యా చాల ఎక్కువ . మనిషి మానసిక స్థాయిల్లో కొన్ని ప్రత్యెక లక్షణాల తో కూడి సంభవించే వ్యాధి " డిప్రషన్ " . డిప్రషన్ కి లోనయిన వ్యక్తులు దైనందిన జీవితం లో ఎ పనిని సమర్ధవంతంగా నిర్వహించలేరు .
కొన్ని ప్రత్యెక కారణాల వలన కలిగే 


దు:ఖము ,
దురద్రుస్థము ,
నైరాశ్యం ,
అమితం గా ప్రేమించే వ్యక్తిని కోల్పోవడం ,వ్యాకులపడటానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి -

ఆరోగ్య సమస్యలు,
పరీక్షలలో ఫెయిల్‌ కావడం,
ఆత్మీయులు మృతి చెందడం,
ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి.వంటి సంఘటనలు మనిషిని వ్యాకులతకు లోను చేస్తాయి . ఇటువంటి సంఘటనలు ప్రతి వ్యక్తీ జీవితంలో ఎప్పుడోఒకసారి అనుభవిస్తూనే ఉంటాడు . అనటువంటి సందర్భాలలో ఆవేదన చెందడం సహజమే .
ఎ ఒక్కరి జేవితమూ ఎల్లప్పుడూ ఆనందదాయకం గా ఉండాలను కోవడం పొరపాటు . విచారము , దిగులు కలుగని వ్యక్తులు సమాజం లో ఉండకపోవచ్చు . మససు దిగులుగా ఉన్నంత మాత్రాన . సంతోషం లేనంత మాత్రాన ఆ వ్యక్తీ డిప్రెషన్ కి లోనయ్యాడని భావించ కూడదు .కారణాలు :

డిప్రెసన్ అనేది వంశపారంపర్యం గా వచ్చే జబ్బు . డిప్రెషన్ కు కారణమయ్యే కారణాలు మానసికమైనవి మాత్రమే కానవసరం లేదు . ఇన్ఫెక్షన్ , ఫ్లూ . తదితర వైరస్ వ్యాధులు మొదలైనవి కుడా తాత్కాలికంగా డిప్రెషన్ కి కారణమవుతుంటాయి . డిప్రెషన్ కు లోనయే నైజం ఉన్న వ్యక్తులు కు ఆత్మన్యూనతా భావం ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది . వీరిలో నిరాశ అత్యధికంగా ఉంటుంది . ఏ విషయాల పై ఆసక్తి ఉండదు . డిప్రెషన్ లక్షణాలు అందరిలొనూ ఒకే మదేరిగా ఉండవు . కొంత మందిలో నిద్ర తక్కువైతే , మరికొంతమందిలో నిద్ర ఎక్కువగా ఉంటుంది . కొందరికి ఆకలి ఎక్కువైతే ... మరి కొందరికి ఆకలే ఉండదు . మానియాడిప్రెషన్ అనే మరో రకం డిప్రెషన్ కి గురైన వారికీ 'విపరీతమైన ' ఆవేశం ఉంటుంది . వీరు కొంతసేపు విపరీతంగాకృంగిపోయి ఉంటారు ... మరికొంతసేపు ఏంతో ఆనందం గా కనిపిస్తారు .డిప్రెషన్ కి గురైన వ్యక్తుల్లో కనిపించే మరొక తీవ్ర పరిణామం " ఆత్మహత్యా తలంపు " ... జీవతం వృదా అనే ఆలోచన వీరి మదిలో అధికంగా ఉంటుది . ఎవ్వనం దశలో డిప్రెషన్ కు గురైన వ్యక్తులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు . డిప్రెషన్ గురైన వ్యక్తులకు మానసిక వైద్య నిపులతో చికిత్స తీసుకోవడం మంచిది .

కొన్ని లక్షణాలు :

నిద్రపట్టకపోవడం ,
భయము ,
ఏకాంతజీవనము ,
మానసిక అస్థిరత ,
అలసట ,
అనాసక్తి ,
విసుగు ,
కోపము ,
ఆలోచించలేకపోవడం ,
బరువు తగ్గడం ,
జీవితము వ్యర్ధమనే భావన ,
రోజంతా విచారముగా కనిపించడం ,
చనిపోవాలనిపించడము ,

చికిత్సభావనల వ్యక్తీకరణ: డిప్రెషన్‌కు గురైన వ్యక్తి తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో తన భావనలను పంచుకోవాలి. స్వల్ప స్థాయి డిప్రెషన్‌ కేసులలో ఈ విధమైన చర్య ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు - వివాహ బంధానికి సంబంధించిన సమస్యల వలన డిప్రెషన్‌కు గురైతే కౌన్సెలింగ్‌ విధానం ద్వారా సమస్యను పరిష్కరించి, డిప్రెషన్‌నుంచి బైటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
మందులు : డిప్రెషన్‌కు గురైన రోగులకు యాంటి డిప్రెసెంట్‌ ఔషధాల ద్వారా చికిత్స చేస్తారు. ఈ ఔషధాలు సురక్షితమైనవి. ఎంతో శక్తివంతంగా పని చేస్తాయి. ఈ ఔషధాలకు అలవాటుపడటం జరుగదు. వాటి వలన దుష్ఫలితాలు సంభవించవు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలిగించవు.

అయితే, ఈ మందులను ఇతర మందు లతో కలిపి తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. కనుక వీటినివాడవలసి వచ్చినప్పుడు వైద్యపర్యవేక్షణలో ఉపయోగించడం మంచిది.
డిప్రెషన్‌కు గురైన వ్యక్తులు సాధారణ చికిత్సా ప్రక్రియలకు స్పందించని సమయంలో కొన్ని ప్రత్యేక చికిత్సలవసరం అవుతాయి. ఇటువంటి వారిని సైకియాట్రిస్టుల వద్దకు చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సైకియాట్రిస్టుల వద్దకు తీసుకువెళ్లినంత మాత్రం చేత వారిని 'పిచ్చివాళ్లుగా జమకట్టాల్సిన అవసరం లేదు.

స్వయం సహాయం
డిప్రెషన్‌కు గురైన వారు తమకు తాము ఏ సహాయం చేసుకోగలుగుతారనే అంశాన్ని కూడా పరిశీలిద్దాం.
నిశ్శబ్దంగా ఉండవద్దు, ఒక వ్యక్తి డిప్రెషన్‌కు గురి కావడమనేది చాలా నెమ్మదిగా సాగుతున్నప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులను అతడి/ఆమె కుటుంబ సభ్యులు కూడా దానిని గుర్తించలేకపోవచ్చు. అటువంటి సమయాల్లో ఆ వ్యక్తి మౌనం వీడి, తన భావోద్వేగాలను వివరించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఉపయుక్తమైన పనులు చేయడం : డిప్రెషన్‌నుంచి బైటపడటానికి శరీరానికి, మనస్సుకు ఉపయోగకరంగా ఉండే కొన్ని రకాల చర్యలు చేపట్టవచ్చు. ఉదాహరణకు నడక వంటి వ్యాయామ ప్రక్రియ చేపట్టవచ్చు. మందిరాలకు వెళ్లి రావచ్చు. స్నేహితులతో కొంతసేపు ముచ్చటించవచ్చు. 'ఇది నయం కాదేమోననే భావన కలుగనీయకూడదు.

భోజనం చేయాలని అనిపించకపోయినా సమతులాహారం తీసుకోవడం అత్యవసరం. మద్యాన్ని సేవించాలని, నిద్ర మాత్రలను వేసుకోవాలనే భావనను దరి చేరనీయవద్దు. డిప్రెషన్‌కు లోనైనప్పుడు దానిని నయం చేయవచ్చు నని గుర్తుంచుకోండి.

ప్రదమ చికిత్స :
డిప్రెషన్ కి కారణమైన అంశాన్ని తెలుసు కొని ... దానికి దూరం గా ఉండడం , ఉంచడం ..
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉండాలి , కలిసి మెలసి ఆత్మీయత గా ఉండాలి ,
అన్నివేళలా డిప్రెషన్ లోనైనా వ్యక్తికి .. తనకు నచ్చిన వ్యక్తీ తోడుగా ఉండాలి ... ముఖ్యం గా ఆత్మహత్య విషయంలో.
1.tab. Tryptomer 10 mg 3 tabs /day .
2.tab . Alprox 0.25 mg. 1 tab - night at bed time .
3.tab . Basitone forte 1 tab - dailyపై మందులు సుమారు 3 -4 నెలలు వాడాలి .
మంచి సైక్యట్రిక్ డాక్టర్ ని సంప్రదించి సరియైన వైద్యం తీసుకోవాలి .

updates : 

--------------

కుంగుబాటుకు సైకిల్‌ బ్రేక్‌-- తరచూ కుంగుబాటు బారిన పడుతున్నారా? అయితే సైకిల్‌ తొక్కటం మొదలెట్టండి. శారీరకశ్రమతో కూడిన ఇలాంటి వ్యాయామాలు ఒత్తిళ్లను దూరం చేయటంలో బాగా తోడ్పడుతున్నట్టు తాజా అధ్యయంలో వెల్లడైంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే కుంగుబాటు ముప్పు సగానికి తగ్గుతుందనీ బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. అయితే ఖాళీగా ఉన్న సమయంలో శారీరకశ్రమ చేయటం వల్లనే మానసిక ఆరోగ్యం చేకూరుతుందని వివరిస్తున్నారు. సైకిల్‌ తొక్కటం వంటి పనులు ఒత్తిడిని దూరం చేయటానికి బాగా దోహదం చేస్తాయని.. కాబట్టి కుంగుబాటు, ఆందోళన సమస్యలకు చికిత్స చేయటంలో వీటిని తప్పకుండా చేర్చాలని అధ్యయనానికి నేతృత్వం వహించిన కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకుడు సామ్యూల్‌ హార్వే సూచిస్తున్నారు. మరీ చెమటలు కారిపోయేంతగా, శ్వాస చాలా వేగంగా తీసుకునేంత తీవ్ర స్థాయిలో వ్యాయామం చేయకపోయినా మెరుగైన ఫలితాలు కనబడుతుండటం విశేషం. తేలికపాటి వ్యాయామాలు చేసినవారిలోనూ కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పడుతున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు.

కుంగుబాటు (డిప్రెషన్‌) మీద అపోహలు

కుంగుబాటు (డిప్రెషన్‌) మీద చాలా అపోహలున్నాయి. ఇది స్త్రీలకే వస్తుందని కొందరు భావిస్తుంటారు. ఒకసారి కుంగుబాటు మొదలైతే అది జీవితాంతం వెంటాడుతుందని మరికొందరు అనుకుంటూ ఉంటారు. అసలు వీటిల్లోని నిజమెంత?

* అపోహ: కుంగుబాటు అనేది బలహీనతకు సూచిక.

* నిజం: కానే కాదు. ఇది ఒక మానసిక రుగ్మత. ఆత్మీయులు, సన్నిహితులు మరణించటం వంటి సంఘటనలు ఎదురుకావటంతో పాటు.. జన్యుపరమైన అంశాలు కూడా దీనికి కారణమవుతాయి.

* అపోహ: కుంగుబాటు స్థితి నుంచి చాలామంది తమకు తాముగానే బయటపడతారు. చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు.

* నిజం: ఇది చాలా తీవ్రమైన ఆరోగ్యసమస్య. మందులు, కౌన్సెలింగ్‌ వంటి పద్ధతులతో చికిత్స తీసుకోవటం తప్పనిసరి. నిపుణుల సూచనల మేరకు పూర్తికాలం చికిత్స తీసుకోకపోతే కుంగుబాటు లక్షణాలు తిరగబెట్టే ప్రమాదమూ ఉంది.

* అపోహ: కుంగుబాటును తగ్గించే మందులు ప్రభావం చూపకపోతే.. ఇక అవి ఎప్పటికీ పనిచేయవు.

* నిజం: సాధారణంగా వీటిని వాడటం మొదలెట్టిన 2-4 వారాల తర్వాత ప్రభావం కనిపిస్తుంటుంది. దీనిని గుర్తించటానికి కొంత సమయం పడుతుంది.

* అపోహ: ఇది కేవలం మహిళలకే వస్తుంది.

* నిజం: కుంగుబాటు పురుషులకూ వస్తుంది. కాకపోతే మగవారిలో కన్నా స్త్రీలల్లోనే అధికం.

* అపోహ: డిప్రెషన్‌ కూడా అప్పుడప్పుడు మూడ్‌ మారటం లాంటిదే.

* నిజం: మూడ్‌ మారటమనేది ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటుంది. అయితే డిప్రెషన్‌ దీర్ఘకాలం వేధించే సమస్య. ఇది చదువులు, ఉద్యోగాల్లో ముందుకు వెళ్లకుండా చాలా చిక్కులను తెచ్చిపెడుతుంది.

--డా .వందనా శేషగిరిరావు -శ్రీకాకుళం .
Read More »

Like//Share :

రక్త పోటు (Blood Pressure ) - పాటించవల్సిన విషయాలు..


గుప్పెడంత గుండె మన ఛాతీలో రెండు ఊపిరితిత్తుల మధ్య పెరికార్డియం అనే పోరని కప్పుకొని నియమం గా , నిశ్చలం గా ఉండే ఓ శరీర అవయవము . ఈ గుండె తన క్రమాన్ని , నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా , తక్కువగా కొట్టుకున్నా అది మన జీవనాన్ని శాసించే వ్యాధి ... గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు .

గుండె , రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడి ని రక్తపోటు లేదా బ్లడ్ ప్రజర్ అంటారు . ఇది ముఖ్యం గా రెండు స్థితుల పై ఆశారపడి ఉంటుంది . 1.గుండె కండరాలు పంపు చేసే శక్తి , 2. రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంతవరకు తీసుకుంటాయో... ఆ శక్తి .

బ్లడ్ ప్రజర్ రెండు స్థితులలో గమనిస్తాము ... గుండె పూర్తిగా ముకులించుకునే (ముడుచుకునే) స్థితి ని " సిస్తొ లిక్ (Systolic)" అని , పూర్తీ గా విచ్చుకునే స్థితిని " డయస్టొలిక్(Diastolic)"అని అంటారు . ఈ రెండిటికీ మధ్య తేడాని " పల్స్ ప్రజర్(Pulse Pressure)" అని వ్యవహరిస్తారు .

బ్లడ్ ప్రజర్ ని కొలిచే సాదనం -- స్పిగ్మో మనో మీటర్ (Spygmomanometer) ఇందులో మెర్కురి రకము మంచిది . watch type - గాలినివాడే రకము , ఎలక్ట్రానిక్ రకము -సరిఅయిన కొలతలను (Readings) చూపించడం లేదు .

ఆరోగ్యవంతమైన నడివయసు వారికి 120 సిస్తోలిక్ , 80 డయాస్టోలిక్ ఉంటుంది . పుల్సు ప్రజర్ 4౦ ఉంటుంది . ఈ రక్తపోటు అనేక అంశాలమీద ఆధారపడి మారుతూ ఉంటుంది . ఇది 140/90 కంటే ఎక్కువైతే " అధిక రక్తపోటు(Hypertension) హై ప్రజర్ " గాను , 90/60 కంటే తక్కువైతే " అల్ప రక్తపోటు (Hypotension) లో ప్రజర్ " గాను అంటాము . ఈ రెన్దూ ప్రమాదకరమైనవే .

రక్తపోటును ఎక్కువ చేసే పరిస్తితులు --

శారీరకంగా , మానసికంగా .. ఎక్కువ శ్రమ పొందినపుడు ,
ఆవేశము పడినపుడు ,
మానసిక ఆందోళన చెందినపుడు ,
ఉరకనే కోపం తెచ్చుకోవడం ,
తరచూ నిర్లిప్తతకు లోనుకావడం , భయం , ఆత్రుత .
వయసు మళ్ళిన వారికి ,
రక్త నాళాల లోపలి పోర గట్టిపడి పోవడం " ఆర్టీరియో స్క్లీరోసిస్" వలన ,
మూత్రపిండాల వ్యాధులలోను ,
రక్తము లో వచ్చే కొన్ని మార్పులు ,
లావుగా ఉండడము ,
ఉప్పు , కారాలు ఎక్కువగా తినడం ,
పొగ , ఆల్కహాల్ .. ఎక్కువగా తాగడం ,
వంశపారంపర్యం గా వచ్చే రకము .హైపోటెన్సన్-లోబి.పి. (Hypotension) కి దారితీసే పరిస్తితులు ..:

ఏదైనా దీర్ఘకాలిక జబ్బు పడినపుడు ,
ఎక్కువరోజులు ఉపవాసం ఉండటం ,
మానసిక వ్యాధులకు వాడిన కొన్ని మందులవలన ,
తీసుకున్న కొన్ని మందులు వికటించినప్పుడు ,
ఎక్కువ రక్తస్రావం జరిగినపుడు ,
మధుమేహం ఉన్నప్పుడు ,
వ్యాధి లక్షణాలు :

తరచూ తలనొప్పి రావడం ,
నడినెత్తి లో బరువు , భారం గా ఉండడం ,
తలతిరగడం ,
చాతి బరువు , నొప్పి గా ఉండడం ,
చూపు మందగించడం .
వికారము ,వాంతి అనిపించడం ,
మాట తడబడడం ,
తరచూ చెమట పట్టడడం ,చికిత్స :
హై బీపీ నివారణ,High B.P prevention

ఈమధ్యకాలంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య హై బీపీ. ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఊబకాయం, కిడ్నీ సమస్య, హార్మోన్లలో మార్పులు, ఉప్పు ఎక్కువగా తినడం, వంశ పారంపర్య లక్షణం లాంటి అనేక కారణాలతో హై బీపీ వస్తుంది. కారణం ఏదైతేనేం అధిక రక్తపోటు సమస్య మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు లాంటి ఆటుపోట్లకు దారితీస్తుంది. బ్రెయిన్ హామరేజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కనుక హై బీపీని అశ్రద్ధ చేయడానికి వీల్లేదు.

బీపీ అదుపు తప్పకుండా చూసుకోవాలి. అందుకు ఎన్నో సులువైన మార్గాలున్నాయి. వాటిల్లో ఏ కొన్ని పాటించినా హై బీపీ నుండి బయట పడవచ్చు. అలాంటి రెమెడీలు మీ కోసం...

* రోజూ వ్యాయామం చేయాలి. అందువల్ల రక్తప్రసరణ సవ్యంగా సాగి, హై బీపీ తగ్గుతుంది.
* పచ్చటి చెట్ల మధ్య అరగంటపాటు వాకింగ్ చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
*ప్రాణాయామం, వజ్రాసనం, మత్స్యాసనం మొదలైన ఆసనాలు హై బీపీని తగ్గిస్తాయి.
* తినే పదార్ధాల్లో ఉప్పు బాగా తగ్గించాలి. వత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం మెడిటేషన్ చేయాలి.
* సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే తక్షణం మానేయాలి.
* ఉసిరి పొడిని తేనెతో రంగరించి తింటే హై బీపీ తగ్గుతుంది.
* పుచ్చకాయ జ్యూసు అధిక రక్తపోటును నివారిస్తుంది.
అన్నీ తేలికైన మార్గాలే. వీటిల్లో ఏ కొన్నిటిని పాటించినా హై బీపీ నుండి బయటపడవచ్చు. ఇంత సులువైన మార్గాలను వదిలి ప్రాణాంతకమైన హై బీపీని నియంత్రించడం అలాటు చేసుకోవాలి.

హై బి.పి. కి :->
ఆహార అలవాట్లలో మార్పూ -- ఉప్పు ,కారము , క్రొవ్వు పదార్దములు తక్కువగా తినాలి , వ్యసనాలు (తాగుడు ,ధూమపానము ) మానివేయాలి .
క్రమము తప్పకుండ వ్యాయామము చేయాలి .
వాడె మందులు :
central Acting:
adelphan , levo dopa .

periperally Acting :
Alpha blockers---Alfuzosin , * Prazosin * Doxazosin * Tamsulosin * Terazosin
Beta blockers --, atenolol,metaprolol
Calcium chanel blockers,--- depin ,amlodepin
ACE inhibitors ,--=eg.-analapril maleate
ARBlockers ,---=eg. all sartans - telmisartan
Diuretics eg ;--- frusemide , spiranolactone

LowPressure కి మందులు అవసరం ఉండదు .

నీరసంగా ఉన్నప్పుడు ... పడుకొని రెస్ట్ తీసుకోవాలి .
నీరు , మజ్జిక త్రాగాలి ,
అవసరమైతే .. డాక్టర్ సలహాతో సెలైన్ ఎక్కించుకోవాలి .
బి .కాంప్లెక్ష్ మాత్రలు వాడితే లోప్రెజర్ అంతగా రాదు .మందులు వాడె విసయములో మంచి డాక్టర్ ని సంప్రదించి సరియైన మందును .. సరియున మోతాదులో వాడాలి .

రక్తపోటుకు చెక్‌ కి కొన్ని చిట్కాలు :
రక్తపోటు సాధారణ స్థాయి 120/80. ఇది చాలామందికి తెలిసిందే. మరి అధికరక్తపోటు అంటే... 140/90. అదే చక్కెరవ్యాధి, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికైతే అది 130/80కి చేరుకున్నా ప్రమాదంలో పడ్డట్టే. దీని బారి నుంచి తప్పించుకోవాలంటే జీవనశైలీ ఆహారపుటలవాట్లూ మార్చుకోవాల్సిందే.
ఆహారంలో ఉప్పు తగ్గించగానే సరిపోదు, పొటాషియం అధికంగా లభ్యమయ్యే పళ్లూ కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి, అరటి, మామిడి, కమలా, స్ట్రాబెర్రీ పళ్లల్లోనూ బంగాళదుంప, టొమాటో, దోస, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, తాజా క్యారెట్లు వంటి కూరగాయల్లోనూ పొటాషియం అధికం. పచ్చిటొమాటోల్లో ఉండే లైకోపీన్‌ బీపీని తగ్గిస్తుంది. మటన్‌, బీఫ్‌, పోర్క్‌ వంటివాటిని తగ్గించి చేపల్ని ఎక్కువగా తినాలి. వంటల్లో నువ్వులనూనె వాడితే మంచిది. అప్పడాలు, వడియాలు అస్సలు తినొద్దు.
రోజుకు ఒక కప్పు మించి కాఫీ తాగొద్దు. అందులో ఉండే కెఫీన్‌ గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. మద్యపానం అలవాటుంటే ఒకటిన్నర పెగ్గుకు మించకూడదు.
రోజూ పూలమొక్కల మధ్య కాసేపు నడిస్తే ప్రశాంతంగా ఉంటుంది.
నిత్యం ధ్యానం చేయడం వల్ల కూడా ఫలితం కనిపిస్తుంది.


వృద్ధాప్యంలో అధిక రక్తపోటు

వయస్సు పెరిగే కొద్దీ చాలామందిలో అధిక రక్త పోటు ఉంటుంది. 2005 సంవత్సరంనాటి గణాంకాల ప్రకారం అమెరికాలో 6.5 కోట్లమం దికి అధిక రక్తపోటు ఉండగా, వీరిలో చాలా మంది వృద్ధులే.
వృద్ధాప్యంలో అధిక రక్తపోటు వల్ల గుండె పోటు, పక్షవాతం, గుండె వైఫల్యం, మూత్ర పిండాల వైఫల్యం మొదలైన సమస్యలన్నీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

వృద్ధుల్లో వయస్సును బట్టి రక్తపోటు కొంత ఎక్కువగా ఉండవచ్చుననే అపోహ ప్రజల్లో ఉండేది. ఇది సరైన అవగాహన కాదని శాస్త్రీ యంగా నిరూపణ అయింది.
70 సంవత్సరాల వయసు వారిలో సిస్టో లిక్‌ రక్తపోటు 170 ఉండవచ్చుననే అభిప్రాయం సరికాదు. ఏ వయస్సులోని వారికైనా సిస్టోలిక్‌ రక్తపోటు 140, అంతకంటే ఎక్కువ ఉండకూ డదు. డయస్టోలిక్‌ రక్తపోటు 90 అంతకంటే ఎక్కువ ఉండకూడదు.
వయస్సు పెరుగుతున్నకొద్దీ 80 ఏళ్ల వరకూ సిస్టోలిక్‌ రక్తపోటు పెరుగుతూ ఉంటుందని, 55 సంవత్సరాల వయస్సు తరువాత డయ స్టోలిక్‌ రక్తపోటు పెద్దగా పెరగదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.

సిస్టోలిక్‌ రక్తపోటు 140, అంతకంటే ఎక్కువ గానూ, డయస్టోలిక్‌ రక్తపోటు 90 అంతకంటే తక్కువగానూ ఉండటాన్ని ఐసోలేటెడ్‌ సిస్టోలిక్‌ అధిక రక్తపోటు అంటారు. ఈ విధమైన అధిక రక్తపోటు 60 సంవత్సరాల వయస్సు దాటిన అధిక రక్తపోటు రోగుల్లో 65 శాతం మందిలో ఉంటున్నదని సర్వేలు తెలుపుతున్నాయి.

సిస్టోలిక్‌ రక్తపోటు సంఖ్యనుంచి డయస్టోలిక్‌ రక్తపోటు సంఖ్యను తీసివేయగా వచ్చిన దానిని పల్స్‌ ప్రెషర్‌ (నాడి ఒత్తిడి) అంటారు.
మామూలుగా ఉండవలసిన రక్తపోటు 120/80 కాగా, మామూలు పల్స్‌ ప్రెషర్‌ 40. ఒక వృద్ధుడికి రక్తపోటు 170/90 ఉంటే అతడి పల్స్‌ ప్రెషర్‌ 80 అని చెప్పవచ్చు.

ఈ విధంగా వృద్ధాప్యంలో పెరిగే సిస్టోలిక్‌ రక్తపోటు, పల్స్‌ ప్రెషర్‌లు తమ దుష్ప్రభా వాలను ఆ వ్యక్తి గుండె మీద, రక్తనాళాల మీద చూపిస్తాయి.


ఎసెన్షియల్‌ హైపర్‌టెన్షన్‌,Essential Hypertension


నూటికి సుమారు 95మందిలో రక్తపోటు పెరగ టానికి కారణాలు ఇతమిత్థంగా తెలియవు. దీనిని ఎసెన్షియల్‌ (ప్రైమరీ) హైపర్‌టెన్షన్‌ అంటారు. 5 నుంచి 10 శాతం రోగుల్లో అధిక రక్తపోటుకు కొన్ని ప్రత్యేక వ్యాధులు కారణం కావచ్చు. వీటిని సెకండరీ హైపర్‌ టెన్షన్‌ అంటారు.

ఎసెన్షియల్‌ హైపర్‌టెన్షన్‌ రావడానికి వంశానుగత కారణాలు ముఖ్యపాత్ర వహిస్తాయని వైద్య శాస్త్రవే త్తలు విశ్వసిస్తున్నారు. అధిక రక్తపోటు వంశపారం పర్యంగా వచ్చే వ్యాధుల్లో ఒకటని చెప్పవచ్చు.

రక్తపోటు మామూలుగా ఉన్నవారిలో కంటే రక్త పోటు అధికంగా ఉన్నవారి రక్త బంధువుల్లో అధిక రక్తపోటు, పక్షవాతం, కరొనరీ గుండె జబ్బులు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. అధిక రక్తపోటు ఉన్నవారి తల్లిదండ్రుల్లో, రక్తబంధువుల్లో పక్షవాతం (పెరాలి సిస్‌) 3 నుంచి 5 రెట్లు ఎక్కువని వైద్యశాస్త్ర నివేది కలు పేర్కొంటున్నాయి.

వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లోనూ, స్త్రీలలోనూ రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. 50 సంవత్సరాల వయస్సు వరకు ఈ వ్యాధి పురుషుల్లో ఎక్కువగా ఉంటున్నది. తరువాతి వయస్సులో అధిక రక్తపోటు స్త్రీ పురుషుల్లో దాదాపు సమంగానూ, వృద్ధాప్యంలో స్త్రీలలో కొంత ఎక్కువగాను ఉంటున్నది.

-ఫ్రామింగ్‌హామ్‌ అధ్యయనం ప్రకారం 30 నుంచి 65 సంవత్సరాల వరకు సిస్టోలిక్‌ రక్తపోటు సగటున 20 మిల్లీమీటర్ల చొప్పున, డయస్టోలిక్‌ రక్తపోటు 10 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటుందని వెల్లడైంది. రక్తపోటు అధికంగా ఉన్నవారిని 20 సంవత్సరాలపాటు పరీక్షించగా, వయస్సు పెరిగే కొద్దీ కరొనరీ గుండెజబ్బు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయని స్పష్టమైంది.


స్థూలకాయం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఉదాహ రణకు 10 శాతం బరువు పెరిగితే సిస్టోలిక్‌ రక్తపోటు 6.5 మిల్లీమీటర్లు పెరుగుతుంది.
అధిక రక్తపోటు ఉన్న వారిలో 38 శాతం మంది స్థూలకాయులని వెల్లడైంది. మద్యపానం వల్ల సిస్టోలిక్‌ రక్తపోటు పెరుగుతుంది. అధి కంగా పొగ తాగే వారిలో రక్త పోటు, గుండెపోటు, హఠాన్మ రణం ఎక్కువ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పొగాకులోని నికోటిన్‌ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతుంది. రోజువారీ వ్యాయామం చేసే వారిలో కంటే శారీరక వ్యాయామం చేయకుండా సోమరి జీవనాన్ని గడిపే వారిలో అధిక రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వినియోగిం చడానికి, అధికరక్తపోటుకు సంబంధం ఉన్నదని అధ్య యనాల్లో వెల్లడైంది.
ఆహారంలో రోజుకు రెండు గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడే వారిలో (ఉదాహరణకు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ పసిఫిక్‌ దీవుల్లోని కొన్ని జాతులు) అధిక రక్తపోటు దాదాపు లేదనే చెప్పవచ్చు.

తినే ప్రతి వస్తువులో ఉప్పు వేసుకునే వారిలో అధిక రక్తపోటు ఎక్కువ. శరీరానికి ఉప్పు అవసరమే. ప్రతి జీవకణంలోను ఉప్పు ఉంటుంది. రక్తంలోనూ, శరీర కణాల్లోనూ ఉప్పు ఒక నిర్ణీత స్థాయిలో ఉండే విధంగా మూత్ర పిండాలు నియంత్రి స్తాయి. ఒక మామూలు వ్యక్తికి రోజుకు 2 నుంచి 3 గ్రాముల ఉప్పుకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ మాత్రం ఉప్పు మనం తీసుకునే ప్రాథమిక ఆహారాల్లోనే ఉంటుంది. దీనికి ఉదాహరణగా పండ్లు, పచ్చి కూరగాయలను చెప్పుకోవచ్చు.భారతీయులు సాధారణంగా రోజుకు 5 నుంచి 15 గ్రాముల వరకూ అంటే సగటున 8 గ్రాముల ఉప్పు తీసుకుంటారు. మనకు అవసరమైన 2 నుండి 3 గ్రాముల ఉప్పు కాకుండా, వంటలో కాని, భోజనం చేసేప్పుడు కాని మరింత ఉప్పును (3 నుంచి 10 గ్రాముల వరకూ) అదనంగా కలిపి తింటారు.

మామూలు వ్యక్తుల్లో ఈ అదనపు ఉప్పును మూత్ర పిండాలు రక్తంనుండి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. వంశానుగతంగా సంక్రమించిన లోపాల వల్ల, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తుల్లో, ఆహారం ద్వారా అదనంగా చేరిన ఉప్పును మూత్ర పిండాలు విసర్జించకపోవడం వల్ల మరింత సోడియం, నీరు, రక్తంలోను, కణాల్లోనూ నిలువ ఉండిపోతుంది.

ధమనుల గోడల్లోని కణాల్లోకి మరింత సోడియం, నీరు చేరడం వల్ల ధమనులు కుంచించుకుపోయి, గుండె నుండి రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడి, మొత్తం వాస్క్యులార్‌ రెసిస్టెన్స్‌ పెరిగి తద్వారా రక్తపోటు అధికమవుతుంది. రక్తపోటు పెరిగే అవకాశం ఉన్నవారిలో, ఎక్కువ ఉప్పు వినియోగించడం వల్ల, అధిక రక్తపోటు వస్తుందని వైద్య పరిశోధకుల నిశ్చితాభిప్రాయం.

జపాన్‌, కొరియా దేశాల ప్రజల్లో రోజుకు 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకునే అలవాటు ఉంది. పక్షవాత వ్యాధి మిగతా దేశాలకంటే జపాన్‌లో ఎక్కువగా ఉంటున్నది. జపాన్‌ దేశీయులు 1971 - 1981 మధ్య కాలంలో ఉప్పును రోజుకు 4 గ్రాముల కంటే తక్కువ వినియోగించడం ప్రారంభించాకా, అధిక రక్తపోటు తగ్గుముఖం పట్టింది.
బెల్జియం దేశంలో 1968 - 81 మధ్య కాలంలో ఉప్పు వినియోగం తగ్గించిన తరువాత పక్షవాతం తగ్గుముఖం పట్టింది. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తుల సంతానంలో కూడా ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల, ఆందోళన కలిగించే సందర్భాల్లోనూ, చిన్నవయస్సులోనే రక్తపోటు పెరగవచ్చు.

ఎసెన్షియల్‌ హైపర్‌ట ెన్షన్‌కు దారి తీసే మరి కొన్ని కారణాలను వైద్య శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు. వంశానుగత కారణాల వల్ల మానసిక ఒత్తిళ్ల వల్ల, మెదడులోని సింపథిటిక్‌ నాడీ మండలం ప్రభావితం చెంది ఎడ్రినలిన్‌, నార్‌ ఎడ్రినలిన్‌ల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది.

ఇవి గుండె వేగాన్ని, గుండెనుండి ప్రవహించే రక్త పరిమాణాన్ని పెంచడమే కాకుండా, ధమనులను కుంచింప చేయడం ద్వారా రక్తపోటును పెంచు తాయి. సింపథిటిక్‌ నాడీ మండలం ప్రోద్బలం వల్ల మూత్ర పిండాలు, ఎడ్రినల్‌ గ్రంథుల్లోని ఎంజైములు (రెనిన్‌, ఏంజియోటెన్సిన్‌ - ఆల్డో స్టిరోన్‌ సిస్టమ్‌) చైతన్యవంతం అవుతాయి.
ఏంజియోటెన్సిన్‌ ధమనులను అధికంగా కుంచింపజేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎడ్రినల్‌ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్‌ ఆల్డో స్టీరోన్‌ వల్ల మూత్రపిండాలు మరింత సోడియంను, నీటిని శరీరంలో నిలువ చేయడం ద్వారా రక్తపోటు పెరుగుతుంది. ఇంకా అనేక పరిశోధనలు జరుగు తున్న ఈ రంగంలో ఎసెన్షియల్‌ హైపర్‌టెన్షన్‌కు సరైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.

స్త్రీలలో కుటుంబ నియంత్రణకు వాడే మదుల వల్ల కొంతమందిలో కొద్దిగా రక్తపోటు పెరుగవచ్చు. ఈ మందులు వాడటం మానివేశాకా, 6 నెలల్లో రక్తపోటు తిరిగి మామూలు స్థితికి వస్తుంది. స్టీరాయిడ్‌ ఔషధాలు, ఉబ్బస వ్యాధికి, జలుబుకు, కీళ్ల నొప్పులకు వాడే మందుల వల్ల కూడా కొంతమందిలో రక్తపోటు పెరగవచ్చు. డాక్టర్‌ సలహా లేనిదే స్వంతంగా ఏ మందులూ వాడకూడదు.


------------------------------------------------------------------------
డా.శేషగిరిరావు వందన -MBBS ; శ్రీకాకుళం .
Read More »
Like//Share :

టైఫాయిడ్ జ్వరము...తీసుకోవాల్సిన జాగ్రత్తలు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Typhoid Fever , టైఫాయిడ్ జ్వరము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వర్షాకాలపు అనారోగ్యాలు ఒక జాబితాలోకి తీసుకురావడం కష్టతరం. టైఫాయిడ్‌ జ్వరం లేదా టైఫాయిడ్‌ అనేది ఈ వ్యవధిలో తీవ్ర ఆందోళనకు గురిచేసే అలాంటి ఒక వ్యాధి.ఒక్క మాటలో చెప్పాలంటే, టైఫాయిడ్‌ అనేది అతిసారం మరియు దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యాధి. టైఫాయిడ్‌ మరియు టైఫిస్‌కు సాధారణంగా కలిగే న్యూరోసైకియాట్రిక్‌ లక్షణాల నుండి మరియు గ్రీక్‌ పదానికి అర్థం వచ్చే ''Stupor - స్తబ్దత'' నుండి టైఫాయిడ్‌ అనే పేరు వచ్చినది . ఇది నీటి-జనిత వ్యాధి. ఇది వ్యాధి సోకిన వ్యక్తి యొక్క మలంతో కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.

టైఫాయిడ్‌ అనేది సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియా ద్వారా సర్వసాధారణంగా సోకుతుంది. ఈ S.టైఫి త్వరితగతిన మరియు భారీసంఖ్యలో వృద్ధి చెందుతుంది. తీసుకున్న ఆహారం మరియు నీటినుండి ఈ బ్యాక్టీరియా ప్రేగునాళాల ద్వారా వ్యాపించి ప్రేగు గోడలలోకి చొచ్చుకొని పోయి రక్తంలో ప్రవేశిస్తుంది మరియు దీనిని మలం మరియు రక్తనమూనాల ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు. పారిశ్రామిక నగరాలయొక్క పేదలుండే ప్రదేశాలలో మరియు సులభంగా నీరు కలుషితమయ్యే ప్రాంతాలలో టైఫాయిడ్‌ ఎక్కువగా ప్రబలుతుంది. కోస్తా తీర ప్రాంతాలలో నివశించే ప్రజలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అధికంగా పిల్లలపై మరియు 5మరియు 19సంవత్సరాల మధ్య వయసుగల యుక్తవయస్కులైన పిల్లలపై మరియు వయసు పైబడిన వృద్ధులపై మరియు రోగనిరోధక శక్తి కోల్పోయిన వ్యక్తులపై దీని ప్రభావం ఉంటుంది.

టైఫాయిడ్‌ వలన 104 డిగ్రీలF వరకు వదిలిపెట్టని జ్వరం, ముచ్చెమటలు, అతిసారం కలుగుతుంది మరియు కొంతమందిలో శరీరం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడవచ్చును. లక్షణాలు ముదిరి స్పృహ కోల్పోవచ్చును. చికిత్స చేయకుండా వదిలివేస్తే ప్లీహం మరియు కాలేయం పెరగవచ్చును. ఈ సందర్భంలో, ఇది నాలుగు వారాల వరకు ఉంటుంది మరియు ప్రాణాంతకం కూడా కావచ్చును. కావున, ఈ వ్యాధి బారినపడిన వ్యక్తికి చికిత్సనందించే చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం. 'చికిత్స కంటే నివారణే ఉత్తమం' అనే విషయం మనకు తెలిసిందే. ఇలాంటి భయంకరమైన వ్యాధులకు చికిత్సనందించే ప్రయత్నంకన్నా ఇవి ప్రబలకుండా నివారించటానికి తీసుకొనే చర్యలు ఎంతో సులువైనవి. దాదాపు 3%-5% మంది రోగులు తీవ్రంగా ఈ వ్యాధి బారినపడిన తర్వాత ఈ బ్యాక్టీరియాను వ్యాప్తిచేసే వాహకులవుతారు మరియు ఈ అంటువ్యాధి యొక్క నిధిగా వ్యవహరిస్తారు. వీరు తమ మలంలో ఈ బ్యాక్టీరియాను విడుదల చేస్తూ ఉంటారు. ఇది ఆహారాన్ని మరియు నీటిని కలుషితం చేస్తుంది మరియు ఈ వ్యాధి ఇతరులకు సంక్రమింపజేస్తుంది.


టైఫాయిడ్ జ్వరములో స్టేజీలు :

ఫస్ట్ స్టేజ్ : ఈ సమయము లో తీవ్రమైన జ్వరము , నీరసము , తలనొప్పి , కడుపు నొప్పి, చర్మముపై దద్దుర్లు ఉంటాయి.

సెకెండ్ స్టేజ్ : బరువు తగ్గిపోవడము , జ్వరము , విరోచనాలు లేదా మందము , కడుపుబ్బడము ఉంటాయి.

థర్డ్ స్టేజ్ : 2-3 వారాలు చికిత్స లేని టైఫాయిడ్ లో మనిషి బాగా నీరసించి , అపస్మారక స్థితిలోనికి జారుకుంటాడు . పేలాపన , తీవ్రమైన జ్వరము ఉండి ... మరణానికి దగ్గరగా ఉంటాడు .


రోగ నిర్ధారణ

* వైడాల్ పరీక్ష (Widal test) ద్వారా సాల్మోనెల్లా ప్రతిరక్షకాలను గుర్తించడం జరుగుతుంది.
* రక్తం మరియు మల పరీక్ష (Blood and Stool culture) ద్వారా సాల్మోనెల్లా క్రిములను ప్రయోగశాలలో వృద్ధిచెందించి గుర్తిస్తారు.

నివారణ వ్యాక్సిన్లు లభ్యమవుతున్నప్పటికీ, ఇవి 60-80%మాత్రమే సురక్షితం మరియు ముఖ్యంగా ఈ వ్యాధి ప్రబలినప్పుడు ఉపయోగపడతాయి. మలవిసర్జన తర్వాత మరియు ఆహారాన్ని హ్యాండిల్‌ చేసేముందు ఆరోగ్య సబ్బుతో మీ చేతులు కడుగుకోవటం అనేది ఈ అంటువ్యాధిని మరియు మరిన్ని ఇతర రోగాలను నివారించటానికి దోహదపడటంలో ఎంతో మేలు చేస్తుంది. బయటనుండి ఇంటికి వచ్చిన తర్వాత చేతులను కడుగుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి అలవాట్లు చిన్నతనం నుండే అలవడితే ఇంతకన్నా మంచిదేముంటుంది. మానవ మల మూత్రాలు ఆహారం మరియు త్రాగునీటితో కలిసిన ప్రదేశాలలో టైఫాయిడ్‌ ప్రబలుతుంది. సరిగ్గాలేని లేదా సక్రమంగా వండని ఆహారం మరియు పచ్చి ఆహారంను తినుట లేదా పచ్చిపాలను త్రాగుటవలన ఈ వ్యాధి విస్తరిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మరియు ఈ వ్యాధి ప్రబలినప్పుడు త్రాగునీటిని తప్పనిసరిగా కాయాలి మరియు తెరచి ఉన్న పాత్రలనుండి త్రాగునీటిని త్రాగకుండా ఉండటం ఒక మంచి ఆలోచన అవుతుంది.

మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవటం అనేది రోగాలకు దూరంగా ఉండే అత్యంత సులభమైన మార్గం. అసలు మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచే మంచి మార్గం. మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవటం మరియు బ్యాక్టీరియా నుండి విముక్తి అవటం. సురక్ష ద్వారా తందురుష్టి.

మీ ఆరోగ్యానికి రక్షణ ఇస్తాయి ఒక మంచి హెల్త్‌ సోప్‌ మరియు మీ శుభ్రమైన చేతులు.

చేయవల్సినవి మరియు చేయకూడనివి
* పచ్చి లేదా సరిగ్గా వండని ఆహారానికి దూరంగా ఉండండి.
* వ్యాధిసోకిన వ్యక్తితో ఆహారాన్ని పంచుకోవద్దు.
* బయటినుండి వచ్చిన తర్వాత మరియు టాయ్‌లెట్స్‌ తర్వాత మంచి ఆరోగ్య సబ్బుతో మీ చేతులను మరియు ముఖాన్ని కడుక్కోండి.
* గోళ్లు కొరికే అలవాటును మానండి.
* యాక్టివ్‌ 5 లాంటి రక్షిత పదార్థాలను కలిగిన సబ్బు సాధారణ సబ్బుకు విరుద్ధంగా అదనపు రక్షణను ఆఫరు చేస్తున్నది.

చికిత్స : పెద్దవారికి ->

Tab.Ciprofloxin(500mg) +Tinidazole(600mg) -- combination two times/day for 7-10 days .
Tab.paracetamol 500mg three times / day for fever controle 7-10 days,
Rest for10 days.

1960 లో ఓరల్ రిహైడ్రేషన్‌ చికిత్స కనుగొన్న తర్వాత టైఫాయిడ్ జ్వరము , విరోచనాలు వలన చనిపోయేవారి సంఖ్య బాగా తగ్గిపోయినది . మంచి అధునాతన యాంటీబయోటిక్స్ అందుబాటులోనికి రావడము వలన దీని చికిత్స చాలా సునాయాసము అయిపోయినది . సమయానికి యాంటీబయోటిక్స్ వాడడము వలన సుమారు 99% మరణాలు నుండి బయటపడడము జరుగుతూ ఉన్నది .

సాదారణము గా సిఫ్రోఫ్లోక్షాసిన్‌ , 3వ తరము సెఫలోస్పోరిన్స్ బాగా పనిచేస్తాయి. 2 వారాలు పాటు చికిత్స చేయాలి .

--- డా.అజిత్ కుమార్ MD DM.హైదరాబాద్ .
Read More »
Like//Share :

Wednesday, September 20, 2017

మలేరియా..! మరి జాగ్రత్త!!

ఎండాకాలం అయిపోయి వర్షాకాలం మొదలయ్యిందంటే అప్పుడు మొదలయ్యే ఆరోగ్య సమస్యల గురించి ముందే అవగాహన కలిగి ఉంటే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి అవకాశం ఉంటుంది. అందుకే వర్షాకాలం మొదలు కాక ముందే వర్షాల్లో వచ్చే జబ్బుల గురించి తెలుసుకొని జాగ్రత్త పడడం అవసరం. అందుకే మండు వేసవిలో మలేరియా విశేషాలు ఎప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే ను పురస్కరించుకుని....


మలేరియా వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్య. ఇది దోమ కాటువల్ల వ్యాపిస్తుంది. మలేరియాను కలుగజేసే పరాన్న జీవి ప్లాస్మోడియం. ఇది దోమ నుంచి మనిషిలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది. మలేరియా పరాన్నజీవికి అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమ వాహకంగా ఉంటుంది. మలేరియా ప్రాణాంతక వ్యాధి. 2015 సంవత్సరంలో దాదాపు 214 మిలియన్ల మలేరియా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో దాదాపు 4లక్షల 38 వేల మంది మరణించారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశాలున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.


నిర్లక్ష్యం తగదు
దోమకాటుకు గురైన వ్యక్తిలో దాదాపు 10-15 రోజుల్లోపు మలేరియా లక్షణాలు బయటపడతాయి. మలేరియా వ్యాధిలో ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఏ జ్వరంలో నైనా కనిపించేవే. ఈ లక్షణాలను బట్టి మలేరియాను నిర్ధారించడం కష్టమే. మాములు జ్వరమే కదా అని ఏ పారాసిటమాల్ టాబ్లెటో వేసుకుంటే అప్పటికి జ్వరం, ఇతర లక్షణాలు తగ్గినప్పటికి రెండు మూడు గంటల వ్యవధిలో తిరిగి జ్వరం వస్తుంది. మలేరియా జ్వరం రాత్రుళ్లు ఎక్కువగా ఉంటుంది. చెమటలతో జ్వరం తగ్గి కొంత విరామంతో తరచుగా జ్వరం వస్తూ ఉంటే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. మలేరియాను క్లినికల్‌గా నిర్ధారించి ప్రత్యేక చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

మలేరియాలో రకాలు
మలేరియా కలుగజేసే ప్లాస్మోడియం పరాన్న జీవి నాలుగు రకాలు.
ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవలే, ప్లాస్మోడియం మలేరియే. వీటిలో మన దేశంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ కనిపించే రకాలు. వీటిని ప్రత్యేకంగా నిర్ధారించడానికి యాంటిజెన్, స్మియర్ టెస్ట్‌లు తప్పనిసరి. యాంటిజెన్ పరీక్షల్లో చాలా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ చాలా ప్రమాదకరమైన సెరిబ్రల్ మలేరియాకు కారణమవుతుంది.

చికిత్స
జ్వరం మలేరియా అయినా కూడా ఏ రకమైన మలేరియా అనే అంశం మీద ఆధారపడి చికిత్స ఉంటుంది. సాధారణంగా ప్లాస్మోడియం వైవాక్స్ చికిత్సకు క్లోరోఫిన్ అనే మందునే వాడుతారు. మొదటి డోస్‌గా 600 ఎంజీ, రెండు గంటల విరామంతో రెండో డోస్‌గా 300 ఎంజీ ఇస్తారు. తర్వాత రెండు రోజుల పాటు 300 ఎంజీ చొప్పున ఇస్తారు.తర్వాత 14 రోజుల పాటు ప్రైమోక్విన్ అనే మందును కొనా పరిస్థితి ఎలా ఉందో ముందుగా ఒకసారి పరీక్షించి నిర్ధారించుకున్న తర్వాత చెయ్యాల్సి ఉంటుంది. అయితే కొంత మందిలో క్లోరోఫిన్ మందు పనిచేయదు. దీనిని క్లోరోఫిన్ రెసిస్టెంట్ మలేరియా అంటారు. వీరికి రెండు మూడు రకాల కాంబినేషన్‌లో మందులు వాడాల్సి ఉంటుంది. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ వల్ల కలిగే మలేరియాను సెరిబ్రెల్ మలేరియా అంటారు. ఈ రకమైన జ్వరానికి క్వినైన్ అనే మందు వాడతారు. ఇది కొంత ఎక్కువ డోస్ మందు అయినప్పటికి తప్పదు.

అశ్రద్ధ కూడదు
సెరిబ్రెల్ మలేరియా ప్రమాదకరం చాలా త్వరగా పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. దీనిని ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా చికిత్స మొదలు పెడితే అంత మంచిది. సెరిబ్రల్ మలేరియాతో వచ్చిన పేషేంట్లు చాలా వరకు తమకు ఏం జరుగుతోందో చెప్పే పరిస్థితిలో ఉండరు. మెదడు మీద ప్రభావం ఉండడం వల్ల చాలా వరకు కన్‌ఫ్యూషన్, మాట తడబడడం, ఏం మాట్లాడుతున్నారో తెలియనట్టు మాట్లాడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు వాంతులు, తీవ్రమైన తలనొప్పి, జ్వరం మాములుగా కనిపించే లక్షణాలు. మలేరియాను అశ్రద్ధ చేస్తే రకరకాల ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తియ్యవచ్చు. లివర్ ఫెయిల్యూర్, లంగ్ ఫేయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక పరిస్థితికి కారణమవుతుంది. ఒక్కోసారి చిన్నపిల్లల్లో మలేరియా సోకినపుడు లోపల జ్వరం ఉన్నప్పటికి పైన తాకి చూసినపుడు చల్లగా ఉంటారు. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ రకం మలేరియాలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇది మన దేశంలో చాలా అరుదు.

  • రెండు వర్షాల మధ్య కాలంలో నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి కాబట్టి నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. 
  • దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, వెంటీలేటర్లకు నెట్ అమర్చుకోవాలి
  • దోమలు ఉన్నాయనుకున్నపుడు క్రిమ సంహారక మందులు చల్లాలి. 
  • దోమ తెరలు ఉపయోగించాలి. 
  • పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 
  • మొక్కల కుండీలు, పూల కుండీలలో నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. 
  • ఎండాకాలంలో ఉపయోగించిన కూలర్లలోని నీటిని పూర్తిగా తీసేసి పక్కన పెట్టాలి. వాటిలో నీళ్లు తీయడంలో అశ్రద్ధ చేస్తే ఆ నీటిలో దోమలు వృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది. 
  • ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూత పెట్టాలి.



Read More »
Like//Share :

సీజనల్ వ్యాధులు.. తగిన జాగ్రత్తలు..


విపరీతమైన ఎండల తర్వాత వచ్చే వర్షాకాలం శరీరానికీ, మనసుకీ ఎంతో హాయిగా ఉంటుంది. తొలకరి జల్లు చిందికే మట్టివాసన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ ఆనందాన్ని పూర్తిగా పొందాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరం. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇలా సీజన్‌ ఏదైనా ప్రజల్ని పలు రకాల వ్యాధులు చుట్టుముడుతూనే ఉంటాయి. సహజంగానే సీజన్‌ మారినప్పుడు జలుబు, దగ్గు, తుమ్ములు, వాంతులు, నీళ్ల విరేచనాలు, టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యు, మెదడువాపు లాంటి వ్యాధులు సంభవిస్తాయి. ఇవన్నీ కూడా నీరు కలుషితం కావడం కారణంగానే సంభవిస్తాయన్నది యదార్థం. నిల్వ ఉన్న నీటిలో బ్యాక్టీరియా, ఫంగస్‌ వ్యాప్తి చెందుతాయి. అందుకని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు వాలిన ఆహార పదార్థాలను, శీతల పానీయాలను తీసుకోకూదని వైద్యులు చెప్తున్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం చాలా మందిచింది. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
  • ఆహారం తీసుకునే ముందు, మల విసర్జన చేసిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. 
  • వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. 
  • ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 
  • క్లోరినేషన్‌ చేసిన నీటినే తీసుకోవాలి. 
  • కాచి వడబోసిన నీటినే తాగాలి. 
  • డయేరియా వ్యాధి బారిన పడిన వారికి రోజుకు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగించాలి. 
  • శుభ్రమైన చోట మాత్రమే మంచినీటిని పెట్టాలి. అలాగే నీటిపై మూత పెట్టడం మరవొద్దు. 
  • మంచినీరు ఉంచిన చోట స్నానం చేయడం, బట్టలు ఉతకడం చేయొద్దు. 
  • కాయగూరలు, పండ్లను శుభ్రంగా కడగాలి. 
  • సాధ్యమైనంత వరకు అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవాలి. 
  • రాత్రి పూట నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా మాంసాన్ని తినొద్దు. 
  • భోజనం చేసే సమయంలో చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
Read More »
Like//Share :

డెంగ్యూ లక్షణాలు..జాగ్రత్తలు..


డెంగ్యూ వ్యాధి దోమలతో వస్తుందనే విషయం తెలిసిందే. ఈజిప్టి జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుండి..ఈ వ్యాధి సోకుతుంది. ఈ దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు పగటిపూటే కుడుతాయి. దోమ కుట్టిన ఐదు..ఎనిమిది రోజుల తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. మరి ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..చూద్దాం..

వ్యాధిలక్షణాలు..
  • నోరు ఎండిపోవడం జరుగుతుంది. దాహం కూడా అధికమౌతుంది.
  • కండరాలు..కీళ్ల నొప్పులుంటాయి.
  • వాంతి అవుతున్నట్లు అనిపిస్తుంటుంది.
  • జ్వరం అధికంగా వస్తుంది.
  • తలనొప్పి కూడా అధికంగా ఉంటుంది.


ఈ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. వ్యాధి ఉందో..లేదో నిర్ధారణ చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందుతాయి. నీరు కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటే ఈ రకమైన దోమలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా తొట్టీలు..కుండీలు..ఖాళీ డ్రమ్ములు..బిల్డింగ్ లపై నిలిచిన వాన నీటిలో ఎక్కువగా పెరుగుతుంటాయి.

జాగ్రత్తలు..
డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. నీరు నిల్వకుండా చూసుకోవాలి. ఇళ్ల వెలుపల నీటి నిల్వలను పారేయాలి. నీటి ట్యాంకుకు మూత వేయాలి. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించి, వారంలో ఒక రోజు డ్రైడే విధానాన్ని తప్పక పాటించాలి.
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి కాపాడుకోవాలి.
శరీరంలోని అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.
పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి.
పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించాలి.
జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


Read More »
Like//Share :

Tuesday, September 12, 2017

ప్రాజెక్ట్ -1: 2,50,000 రూపాయల బడ్జెట్ తో గ్రామం లోని మొత్తం 150 స్తంబాలకు LED వీధిదీపాలను అమర్చడం.

--------------------------------------------------------------------------------------------
Project Estimation Cost (Revised On- 09/20/2017) :
-------------------------------------------------------------------------------------------

ఈ ప్రాజెక్ట్ వివరాలను ఒక్కసారి చదివి ,పరిశీలించండి.!!!😊😇

Total number of Poles in our Village to Implement  = 150   (Including Adepuvaada).
Each LED Street light Total price (COSMO-36W Super Eco)  = Rs  982/- (Price) + 118 /- Rs (12% of GST ~117.84/-) = 1100 /- Rs .
Total Fund Needed for 150 LED lights is  : 150*1100= 1,65,000/-  Rs.

Each Streetlight Pipe with Clamp Cost is = 250/- Rs.
Total Number of Pipes with Clamps are needed =150.
Total Amount is needed for 150 Pipes with Clamps = 150*250 =37500/- Rs + 10500/-(28% of GST)=48,000/- Rs.

Total Cost to setup 150 LED lights ( Including Pipe&Clamps +GST)=1,65,000/- Rs + 48,000/- Rs.= 2,13,000/- Rs

(we will update you all about Transportation,Electrition Charges & Cable needed etc --Soon.)

----------------------------------------------------------------------------------------------

సహాయం చేయువారు దయచేసి ఈ క్రింది అకౌంట్ కి  మీ ఫండ్ transfer చేయగలరు..



Account Name     :  JITHENDER JOGU

Account Number :  263410100021648.

IFSC code            :  ANDB0002634 .

Bank Name          :  Andhra Bank. 

Branch  Name      :  Mulugu.




Donation so  far we have received  for the Rangapuram Development & Donars List is added below.

Click On Image for  Zoom View:







Read More »
Like//Share :

తెలంగాణా క్రొత్త జిల్లాలు - విశేషాలు

 -రాష్ట్రంలో సగటున జిల్లాల విస్తీర్ణం 3,704 చ.కి.మీ.
-జనాభాపరంగా దేశంలో తెలంగాణ రాష్ర్టానికి 12వ స్థానం, వైశాల్యంలో కూడా 12వ స్థానం. జిల్లాల సంఖ్యపరంగా 9వ స్థానంలో ఉంది. 
-రాష్ట్రంలో 5 నుంచి 10 లక్షల జనాభాగల జిల్లాలు 19 ఉన్నాయి. పది నుంచి పదిహేను లక్షల జనాభాగల జిల్లాలు 6, పదిహేను నుంచి ఇరవై లక్షల జనాభాగల జిల్లాలు 3, ఇరవై లక్షల జనాభా పైబడిన జిల్లాలు 3 ఉన్నాయి. 
-రాష్ట్రంలో 6 మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. అవి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్. 
-రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 20 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక సరిహద్దులతో ఉన్నాయి. 
-కర్ణాటక సరిహద్దుగల జిల్లాలు 6. అవి.. మహబూబ్‌నగర్, వికారాబాద్, గద్వాల, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి.
-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగల జిల్లాలు 6. అవి.. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, కొత్తగూడెం.
-మహారాష్ట్రతో సరిహద్దుగల జిల్లాలు 5. అవి.. భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి.
-ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దుగల జిల్లాలు 3. అవి.. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల. 
-అత్యధిక జిల్లాలు వరంగల్ నుంచి ఏర్పడ్డాయి. 
-విభజనకు గురికాని జిల్లా హైదరాబాద్. 

కొత్తవి


-జిల్లాలు - 21
-రెవెన్యూ డివిజన్లు - 25
-మండలాలు - 125
-పోలీస్ కమిషనరేట్‌లు - 4
-పోలీస్ డివిజన్లు - 23
-పోలీస్ స్టేషన్లు - 91
-సర్కిళ్లు - 28


మొత్తం జిల్లాలు: 31
విస్తీర్ణం: 1,12,077 చ.కి.మీ.
జనాభా: 3,50,03,674
అక్షరాస్యత: 66.46

మండలాల సంఖ్య: 584
రెవెన్యూ డివిజన్లు: 68
రెవెన్యూ గ్రామాలు: 10,966

జిల్లాలు-ప్రాముఖ్యత
అతిపెద్ద జిల్లా: భద్రాద్రి-కొత్తగూడెం (8,062 చ.కి.మీ.)
అతిచిన్న జిల్లా: హైదరాబాద్ (217 చ.కి.మీ.)
ఎక్కువ మండలాలు ఉన్న జిల్లా: నల్లగొండ (31)
తక్కువ మండలాలున్న జిల్లా: వరంగల్ అర్బన్ (11)
రెవెన్యూ డివిజన్లు ఎక్కువ ఉన్న జిల్లా: రంగారెడ్డి (11)
తక్కువ రెవెన్యూ డివిజన్లు ఉన్న జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్
అత్యధిక గ్రామాలున్న జిల్లా: సంగారెడ్డి (600)
అతితక్కువ గ్రామాలున్న జిల్లా: హైదరాబాద్ (100)
అత్యధిక జనాభాగల జిల్లా: హైదరాబాద్ (39,43,323)
తక్కువ జనాభా ఉన్న జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా (5,43,694)
అత్యధిక జనాభాగల మండలం: బహదూర్‌పుర (4,68,158)
- హైదరాబాద్
అత్యధిక జనాభాగల రెండో మండలం: ఖమ్మం అర్బన్
తక్కువ జనాభా ఉన్న మండలం: గంగారం (10,780)
- మహబూబాబాద్ జిల్లా
ఎక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా: హైదరాబాద్ (83 శాతం)
తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న జిల్లా: కామారెడ్డి (48.49 శాతం)


ఆదిలాబాదు


Adilabad_District 

విస్తీర్ణం: 4,153 చ.కి.మీ. 
జనాభా: 7,21,433 
అక్షరాస్యత: 63.01 శాతం
మండలాలు: 18 
అత్యధిక జనాభాగల మండలం: ఆదిలాబాదు అర్బన్ మండలం 
అత్యల్ప జనాభాగల మండలం: గడిగూడ 
రెవెన్యూ డివిజన్లు: ఆదిలాబాదు, ఉట్నూరు 
రెవెన్యూ గ్రామాలు: 504 

నల్లగొండ


NALGONDA_District 

విస్తీర్ణం: 6,863 చ.కి.మీ. 
జనాభా: 16,31,399 
అక్షరాస్యత: 65 శాతం
మండలాలు: 31 
అత్యధిక జనాభాగల మండలం: నల్లగొండ 
అత్యల్ప జనాభాగల మండలం: నేరేడుగొమ్ము
రెవెన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ 
రెవెన్యూ గ్రామాలు: 565

నిర్మల్


NIRMAL_District 

విస్తీర్ణం: 3,845 చ.కి.మీ. 
జనాభా: 7,30,286
అక్షరాస్యత: 57.73 శాతం
మండలాలు: 19
అత్యధిక జనాభాగల మండలం: భైంసా
అత్యల్ప జనాభాగల మండలం: నర్సాపురం జి
రెవెన్యూ డివిజన్లు: నిర్మల్, భైంసా
రెవెన్యూ గ్రామాలు: 428

సూర్యాపేట


SURYAPET_District 

విస్తీర్ణం: 3,374 చ.కి.మీ. 
జనాభా: 10,99,560 
అక్షరాస్యత: 63 శాతం
మండలాలు: 23 
అత్యధిక జనాభాగల మండలం: సూర్యాపేట 
అత్యల్ప జనాభాగల మండలం: నాగారం 
రెవెన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ 
రెవెన్యూ గ్రామాలు: 279

మంచిర్యాల


Mancherial_District

 విస్తీర్ణం: 3,943 చ.కి.మీ. 
జనాభా: 7,07,050 
అక్షరాస్యత: 61.81 శాతం
మండలాలు: 18 
అత్యధిక జనాభాగల మండలం: మందమర్రి 
అత్యల్ప జనాభాగల మండలం: భీమారం 
రెవెన్యూ డివిజన్లు: మంచిర్యాల, బెల్లంపల్లి 
రెవెన్యూ గ్రామాలు: 389

యాదాద్రి


YADADRI_District 

విస్తీర్ణం: 3,092 చ.కి.మీ. 
జనాభా: 7,26,465 
అక్షరాస్యత: 68 శాతం
మండలాలు: 16 
అత్యధిక జనాభాగల మండలం: భువనగిరి 
అత్యల్ప జనాభాగల మండలం: అడ్డగూడూరు 
రెవెన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్ 
రెవెన్యూ గ్రామాలు: 296

కుమ్రంభీం ఆసిఫాబాదు


KomaramBheem_District 

విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. 
జనాభా: 5,92,831 
అక్షరాస్యత: 52.62 శాతం
మండలాలు: 15 
అత్యధిక జనాభాగల మండలం: కాగజ్‌నగర్ 
అత్యల్ప జనాభాగల మండలం: లింగాపురం
రెవెన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ 
రెవెన్యూ గ్రామాలు: 435

జయశంకర్ భూపాలపల్లి


Jaya-Shankar_District 

విస్తీర్ణం: 6,175 చ.కి.మీ. 
జనాభా: 7,05,054 
అక్షరాస్యత: 60 శాతం
మండలాలు: 20 
అత్యధిక జనాభాగల మండలం: భూపాలపల్లి 
అత్యల్ప జనాభాగల మండలం: కన్నాయి గూడెం 
రెవెన్యూ డివిజన్లు: భూపాలపల్లి, ములుగు 
రెవెన్యూ గ్రామాలు: 574

భద్రాద్రి కొత్తగూడెం


Kothagudem_District 
విస్తీర్ణం: 8,062 చ.కి.మీ. 
జనాభా: 11,02,094 
అక్షరాస్యత: 62.63 శాతం
మండలాలు: 23 
అత్యధిక జనాభాగల మండలం: పాల్వంచ 
అత్యల్ప జనాభాగల మండలం: ఆళపల్లి 
రెవెన్యూ డివిజన్లు: భద్రాచలం, కొత్తగూడెం 
రెవెన్యూ గ్రామాలు: 449

మహబూబాబాదు


MAHABUBABAD_District 

విస్తీర్ణం: 2,877 చ.కి.మీ. 
జనాభా: 7,70,170 
అక్షరాస్యత: 57 శాతం
మండలాలు: 16 
అత్యధిక జనాభాగల మండలం: మహబూబాబాదు 
అత్యల్ప జనాభాగల మండలం: గంగారం 
రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాదు, తొర్రూరు 
రెవెన్యూ గ్రామాలు: 297

వరంగల్లు(రూరల్)


WARANGAL_District 

విస్తీర్ణం: 2,175 చ.కి.మీ. 
జనాభా: 7,16,457 
అక్షరాస్యత: 66 శాతం
మండలాలు: 15 
అత్యధిక జనాభాగల మండలం: పరకాల 
అత్యల్ప జనాభాగల మండలం: ఖానాపూరు 
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు, నర్సంపేట 
రెవెన్యూ గ్రామాలు: 233

వరంగల్లు(అర్బన్)


WARANGAL_District 

విస్తీర్ణం: 1,305 చ.కి.మీ. 
జనాభా: 11,35,707 
అక్షరాస్యత: 66 శాతం
మండలాలు: 11 
అత్యధిక జనాభాగల మండలం: హన్మకొండ 
అత్యల్ప జనాభాగల మండలం: ఐనవోలు
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు 
రెవెన్యూ గ్రామాలు: 133

సంగారెడ్డి


SANGAREDDY_District 

విస్తీర్ణం: 4,441 చ.కి.మీ. 
జనాభా: 15,23,758 
అక్షరాస్యత: 64.26 శాతం
మండలాలు: 26 
అత్యధిక జనాభాగల మండలం: జహీరాబాద్ 
అత్యల్ప జనాభాగల మండలం: సిర్గాపూర్.....
రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ 
రెవెన్యూ గ్రామాలు: 600

రంగారెడ్డి


RANGAREDDY_District 

విస్తీర్ణం: 5,006 చ.కి.మీ. 
జనాభా: 25,51,731 
అక్షరాస్యత: 75.87 శాతం
మండలాలు: 27 
అత్యధిక జనాభాగల మండలం: సరూర్‌నగర్ 
అత్యల్ప జనాభాగల మండలం: చౌదరిగూడెం 
రెవెన్యూ డివిజన్లు: రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ 
రెవెన్యూ గ్రామాలు: 594

మేడ్చల్


Malkajgiri_District 

విస్తీర్ణం: 1,039 చ.కి.మీ. 
జనాభా: 25,42,203 
అక్షరాస్యత: 69 శాతం
మండలాలు: 14 
అత్యధిక జనాభాగల మండలం: కుత్బుల్లాపూర్ 
అత్యల్ప జనాభాగల మండలం: ఘట్‌కేసర్ 
రెవెన్యూ డివిజన్లు: కీసర, మల్కాజ్‌గిరి 
రెవెన్యూ గ్రామాలు: 161

హైదరాబాద్


HYDERABAD_District 

విస్తీర్ణం: 217 చ.కి.మీ. 
జనాభా: 39,43,323 
అక్షరాస్యత: 83.25 శాతం
మండలాలు: 16 
అత్యధిక జనాభాగల మండలం: బహదూర్‌పూర్ 
అత్యల్ప జనాభాగల మండలం: అమీర్‌పేట 
రెవెన్యూ డివిజన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ గ్రామాలు: 100

కరీంనగర్


Karimnagar_District 

విస్తీర్ణం: 2,379 చ.కి.మీ. 
జనాభా: 10,18,119 
అక్షరాస్యత: 61 శాతం
మండలాలు: 16 
అత్యధిక జనాభాగల మండలం: కరీంనగర్ 
అత్యల్ప జనాభాగల మండలం: కొత్తపల్లి 
రెవెన్యూ డివిజన్లు: కరీంనగర్, హుజురాబాద్
రెవెన్యూ గ్రామాలు: 215

సిరిసిల్ల రాజన్న


Sircilla_District 

విస్తీర్ణం: 2,019 చ.కి.మీ. 
జనాభా: 5,43,694 
అక్షరాస్యత: 66.1 శాతం
మండలాలు: 13 
అత్యధిక జనాభాగల మండలం: సిరిసిల్ల 
అత్యల్ప జనాభాగల మండలం: వీర్నపల్లి
రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల 
రెవెన్యూ గ్రామాలు: 170

పెద్దపల్లి


PEDDAPALLE_District 

విస్తీర్ణం: 2,236 చ.కి.మీ. 
జనాభా: 7,95,332 
అక్షరాస్యత: 60 శాతం
మండలాలు: 14 
అత్యధిక జనాభాగల మండలం: రామగుండం 
అత్యల్ప జనాభాగల మండలం: అంతర్గాం 
రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని 
రెవెన్యూ గ్రామాలు: 215

నిజామాబాదు


NIZAMABAD_District 

విస్తీర్ణం: 4,261 చ.కి.మీ. 
జనాభా: 15,77,108 
అక్షరాస్యత: 54.42 శాతం
మండలాలు: 27 
అత్యధిక జనాభాగల మండలం: నిజామాబాదు (ఉత్తరం) 
అత్యల్ప జనాభాగల మండలం: నిజామాబాదు (దక్షిణం)
రెవెన్యూ డివిజన్లు: నిజామాబాదు, ఆర్మూరు, బోధన్ 
రెవెన్యూ గ్రామాలు: 438

సిద్దిపేట


SIDDIPET_District 

విస్తీర్ణం: 3,432 చ.కి.మీ. 
జనాభా: 10,02,671 
అక్షరాస్యత: 61.45 శాతం, మండలాలు: 22 
అత్యధిక జనాభాగల మండలం: సిద్దిపేట అర్బన్ 
అత్యల్ప జనాభాగల మండలం: కొమురవెల్లి 
రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాదు 
రెవెన్యూ గ్రామాలు: 376

వికారాబాదు


VIkarabad_district 

విస్తీర్ణం: 3,386 చ.కి.మీ. 
జనాభా: 8,81,250 
అక్షరాస్యత: 69 శాతం
మండలాలు: 18 
అత్యధిక జనాభాగల మండలం: తాండూరు 
అత్యల్ప జనాభాగల మండలం: బంట్వారం 
రెవెన్యూ డివిజన్లు: వికారాబాదు, తాండూరు 
రెవెన్యూ గ్రామాలు: 476

కామారెడ్డి


Kamareddy_District

 విస్తీర్ణం: 3,667 చ.కి.మీ. 
జనాభా: 9,74,227 
అక్షరాస్యత: 48.49 శాతం
మండలాలు: 22 
అత్యధిక జనాభాగల మండలం: కామారెడ్డి 
అత్యల్ప జనాభాగల మండలం: బీబీపేట 
రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి రెవెన్యూ గ్రామాలు: 474

నాగర్‌కర్నూలు


NAGARKURNOOL_District

 విస్తీర్ణం: 2,966 చ.కి.మీ. 
జనాభా: 8,60,613 
అక్షరాస్యత: 54.04 శాతం
మండలాలు: 20 
అత్యధిక జనాభాగల మండలం: నాగర్‌కర్నూలు 
అత్యల్ప జనాభాగల మండలం: పదర 
రెవెన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి రెవెన్యూ గ్రామాలు: 362

మహబూబ్‌నగరు


Mahabubnagar_District 

విస్తీర్ణం: 4,037 చ.కి.మీ. 
జనాభా: 12,90,467 
అక్షరాస్యత: 57 శాతం
మండలాలు: 26 
అత్యధిక జనాభాగల మండలం: మహబూబ్‌నగరు అర్బన్ 
అత్యల్ప జనాభాగల మండలం: రాజాపూరు 
రెవెన్యూ డివిజన్లు: మహబూబ్‌నగరు, నారాయణపేట రెవెన్యూ గ్రామాలు: 454

జోగులాంబ గద్వాల


Jogulamba_District 
విస్తీర్ణం: 2,928 చ.కి.మీ. 
జనాభా: 6,64,971 
అక్షరాస్యత: 51 శాతం
మండలాలు: 12 
అత్యధిక జనాభాగల మండలం: గద్వాల 
అత్యల్ప జనాభాగల మండలం: కృష్ణా 
రెవెన్యూ డివిజన్లు: గద్వాల 
రెవెన్యూ గ్రామాలు: 226

జనగాం


Jangaon_District 
విస్తీర్ణం: 2,187 చ.కి.మీ. 
జనాభా: 5,82,457 
అక్షరాస్యత: 61 శాతం
మండలాలు: 13 
అత్యధిక జనాభాగల మండలం: జనగాం 
అత్యల్ప జనాభాగల మండలం: నర్మెట 
రెవెన్యూ డివిజన్లు: జనగాం, స్టేషన్‌ఘనపురం 
రెవెన్యూ గ్రామాలు: 200

మెదక్


MEDAK_District

 విస్తీర్ణం: 2,723 చ.కి.మీ. 
జనాభా: 7,67,428 
అక్షరాస్యత: 55.52 శాతం
మండలాలు: 20 
అత్యధిక జనాభాగల మండలం: మెదక్ 
అత్యల్ప జనాభాగల మండలం: రేగోడ్
రెవెన్యూ డివిజన్లు: మెదక్, తూప్రాన్, నర్సాపూరు 
రెవెన్యూ గ్రామాలు: 381

ఖమ్మం


Khammam_District 
విస్తీర్ణం: 4,360 చ.కి.మీ. 
జనాభా: 13,89,566 
అక్షరాస్యత: 62.26 శాతం, మండలాలు: 21 
అత్యధిక జనాభాగల మండలం: ఖమ్మం అర్బన్ 
అత్యల్ప జనాభాగల మండలం: ఏన్కూరు 
రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు 
రెవెన్యూ గ్రామాలు: 380

జగిత్యాల


Jagtial_District 
విస్తీర్ణం: 3,043 చ.కి.మీ. 
జనాభా: 9,83,414 
అక్షరాస్యత: 54.53 శాతం, మండలాలు: 18 
అత్యధిక జనాభాగల మండలం: జగిత్యాల 
అత్యల్ప జనాభాగల మండలం: బుగ్గారం 
రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి 
రెవెన్యూ గ్రామాలు: 284

వనపర్తి


WANAPARTHY_District 

విస్తీర్ణం: 3,055 చ.కి.మీ. 
జనాభా: 7,70,334 
అక్షరాస్యత: 54 శాతం, మండలాలు: 14 
అత్యధిక జనాభాగల మండలం: వనపర్తి 
అత్యల్ప జనాభాగల మండలం: ఏదుల 
రెవెన్యూ డివిజన్లు: వనపర్తి 
రెవెన్యూ గ్రామాలు: 279
Read More »
Like//Share :